NewsOrbit
వ్యాఖ్య

మనం ఏం మాట్లాడుకోవాలంటే..!

మనం ఇప్పుడు ఏ వంకాయ పులుసు గురించో..ఏ ఉల్లిపాయ పెసరట్టు  గురించో ముచ్చటించుకోవడం మంచిది. వీకెండ్ పార్టీలో..సినిమాలో..షికార్లో ప్లాన్ చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ప్ర్రైమ్ వీడియో..నెట్ ఫ్లిక్స్..హాట్ స్టార్..సన్ నెక్ట్స్ వగైరాల్లో తాజా మూవీల సెర్చింగులో మునిగిపోతే ఇంకా నయం. ఏలిన వారికి చిరాకు కలిగించే విషయాల జోలికి పోకుండా మనమేం చేసుకున్నా అడిగేవాడు లేడు. ఆవకాయ పచ్చడి నుంచి అంగారక గ్రహం దాకా మనిష్టం. మనిష్టమొచ్చినంత సేపు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. పాలించే వారిని ప్రశ్నించే సాహసం చేయొద్దు. వారి తప్పులు ఎత్తి చూపే తప్పు అసలే చేయొద్దు. వీలైతే ఆ తప్పులన్నీ ఒప్పులే అని నీ పాండిత్యమంతా ప్రదర్శించి వర్ణించు.  సత్కారాలో బిరుదులో పదవులో నిన్ను వరించడం ఖాయం. నిజానికి నిజం  చెప్పడం కూడా ప్రాణాంతకమైన పని అన్న పచ్చి నిజం గమనించి మసలుకోవడం తెలివైన వారి  లక్షణం.

ఆకాశం ఎర్రగా వుందంటే కుట్ర కేసు పెట్టే అవకాశం లేకపోలేదు. ఇంకా తెలవారదేమీ అని పాటలు పాడితే నీ మీద రాజద్రోహం నేరం మోపి దేశంలో  కటకటాల లెక్కలు తీసే అద్భుతమైన ఉద్యోగమేదో నీకు అప్పగించినా ఆశ్చర్యం లేదు. బూతులు మాట్లాడినా ఓకే. నీతులు వల్లిస్తే నాలుక మీద నిషేధాల వాతలు తప్పవు. స్వాతంత్ర్యం ముమ్మాటికీ కావాలి. అది నీకు కాదు నిన్ను పాలించేవారికి. వాక్కులు నీవి. వాక్ స్వాతంత్ర్యం వారికి. పత్రికలకు స్వాతంత్ర్యం కావాలి. అయితే పాలకుల పల్లకీల మోతలాంటి పరమపావన కర్తవ్య నిర్వహణలో తరించే మీడియాలకే ఆ స్వేచ్ఛ దక్కుతుంది. జాగ్రత్త మెదడు వుంది కదా అని కళ్ల ముందు జరిగే ఘోరాలు చూసి వంద మెలికలు తిరగొద్దు. ఎవరి బుర్ర ఎలా ఎప్పుడు ఏ మోతాదులో స్పందించాలో నియంత్రించే శక్తులున్నాయి. ఏది మంచి..ఏది చెడు, ఏది సత్యం.. ఏదసత్యం చెప్పేది నువ్వు కాదు, అది చెప్పించే వారుంటారు, వారి ప్రామ్టింగులో మెలకువగా జీవించి ధన్యుడవు కావాలి.

మనం ఇప్పుడు కాకరకాయ వేపుడు..సాంబారు పొడి..రాజుగారి పలావు..పుల్లారెడ్డి స్వీట్లు వగైరా వగైరాల మీద బిగ్ డిబేట్లు పెట్టుకోవడం క్షేమదాయకం. హక్కుల హననం..సమ్మెల విఫలం..ఆందోళనల అణచివేత..ఇత్యాది విషయాల మీద మోజు చంపుకుంటే మనం బతికి బట్టకట్టగలం. లేదంటే మనల్ని మనం చంపుకున్నట్టే. భయపడ్డం నేర్చుకో అప్పుడే నీ ప్రాణానికి అభయం. నీ నీడ మీద కూడా ఏవో నీడలు తచ్చాడుతుంటాయి నిశితంగా పరిశీలించుకో. నువ్వు పరిశుద్ధమే కాని, నీ నీడ నిషిద్ధం కావొచ్చు. కలలు కంటావేమో అవి ఏ మీడియంలో ఏ మేరకు కనాలో ముందస్తు దరఖాస్తు పెట్టి మంజూరు చేయించుకో. నీ కన్ళీళ్ళకు నువ్వే సర్ ఆర్థర్ కాటన్‌వి కావాలి. ఏలికల పాదాల మీద తప్ప ఒక్క చుక్క కూడా నేల మీద రాలిందా ఖబడ్దార్. ఒక కుక్క..ఒక పంది..ఒక గేదె..ఒక చెట్టు..ఒక గోడ..ఇలా ఏమైనా కా. మనిషివి మాత్రం కావాలని ఎంతమాత్రం ప్రయత్నించకు. అయితే గియితే బానిసగా బతుకు. అహంకారాలు లేని..ఆలోచనలు లేని..తన శరీరం మీద, మనసు మీద ఎలాంటి అధికారాలూ లేని పశువుగా బతుకు. చేపకు నీళ్ళు కావాలని..పాపకు పాలు కావాలని..పిట్టకు గూడు కావాలని..మనిషికి హక్కులు కావాలని రాజు గారు చెప్పినప్పుడు మనం తలలూపాలి. అలాంటి మాటలు మనం చెప్పకూడదు.

కవులారా ఇక మీరు స్తోత్రాలు రాయండి

గాయకులారా ఇక  మీరు మంగళ గీతాలు పాడండి

చిత్రకారులారా ఇక మీరు భూమీశుల పాద చిత్రాలు గీయండి

మేధావులారా ఇక మీరు తపోవనాలకు తరలిపొండి

మనం ఇప్పుడు నరాలకు రాపిడి పెట్టే కొత్త కొత్త సైట్ల డిస్కవరీలో తలమునకలైతే భద్రం. గుండెను కదిలించే సంగర సంగీతాలు మనకొద్దు. నవ్వొచ్చినా నవ్వొద్దు. ఏడుపొచ్చినా ఏడవొద్దు. ఏ కారణంతో ఏ అక్రమ కేసులో ఇరుక్కుంటావో చెప్పలేం. అన్నీ మూసుకుంటే నీ అంత సక్రమ జీవి లేడని కితాబు అందుకోవచ్చు. పాలకులు మెచ్చే తొవ్వలో నడుచుకో. నీ మీద పువ్వులే పువ్వులు. ప్రజలదేముంది, ఒక రాజును గెలిపించినా ఓడించినా రాలేవి సామాన్య నరకంఠాలే కదా.  తేల్చుకో. కేసు కావాలా? లేక ప్రభువుల వారిచ్చే నజరానాల షోకేసు కావాలా?

 

         డా.ప్రసాదమూర్తి

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment